✍️✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్
■ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు సాక్షరభారత్ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
■ అక్రమ అరెస్టులను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
■ సాక్షర భారత్ సమన్వయకర్త తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం శివసేన రెడ్డి.
సాక్షరభారత్ కోఆర్డినేటర్లు విధుల్లోకి తీసుకోవాలి రాష్ట్ర సంఘం డిమాండ్
అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్.డెస్క్ )సాక్షర భారత్ కో ఆర్డినేటర్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి. డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…….రాష్టంలో

వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో18,306 సాక్షర భారత్ కో ఆర్డినేటర్ లను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. సాక్షర భారత్ కార్యక్రమాన్ని 2010ఆగస్టు లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 443 మండల కోఆర్డినేటర్లు మరియు 17,863 గ్రామ కోఆర్డినేటర్ లు నిర్దాక్షిణ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయి అన్నారు.

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే ఒక గొప్ప పని గ్రామములో నిర్వహించినారు.
సాక్షర భారత్ కోఆర్డినేటర్ లు విద్యతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాల లో పాల్గొని ప్రజల వద్దకు తీసుకుపోయి వారికి ఆ సంక్షేమ ఫలాలు అందజేయడం లో ముఖ్య పాత్ర వీరిదే ఇది జగమెరిగిన సత్యం. పంచాయతీ కార్యదర్శిలగా పనిచేశారు ఇంటి పన్ను వసూలు తో మొదలు పెడితే సమగ్ర కుటుంబ సర్వే ,బతుకమ్మ చీరలు కూడా పంచారు. ,స్వచ్ఛ భారత్ ,ఆసర పెంక్షన్ తదితర ప్రభుత్వ పథకాలలో పనిచేశారు .2018 ఎలక్షన్స్ తర్వాత మార్చ్ లో వీరిని తొలగించడం జరగిందిఅన్నారు.2019 ఫిబ్రవరి 6 తేదీన

ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక శిక్షణ కార్యక్రమములో కో ఆర్డనేటర్ లకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు వారికి ఊసేలేదు.సాక్షరభారత్ కో ఆర్డినేటర్ లను మళ్లీ విధుల్లో తీసుకోక పోతే మంత్రులను, ఎమ్మెల్యే లను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని శివసేన రెడ్డి హెచ్చరించారు.ముఖ్యమంత్రి లేదా విద్య శాఖ మంత్రి స్పందించాలి అని వారు డిమాండ్ చేశారు.వయోజన విద్య కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా…

గాంధీ భవన్ ఎదుట పోలీసులు శివసేన రెడ్డి మరియు సాక్షర భారత్ కో ఆర్డినేటర్ లను అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.త్వరలో ప్రగతి భవన్ ముట్టడిస్తామన్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డి హెచ్చరించారు.అదే విధంగా సాక్షర భారత్ ప్రోగ్రామ్ నే సార్వత్రిక విద్య నవ భారత సాక్షరత కార్యక్రమముగా పేరు పెట్టి కొత్త పథాకం కేంద్ర ప్రభుత్వం రూపొందించి 2022 నుండి 2017 దాకా విద్యతో పాటు డిజిటల్ విద్య,వృతి విద్య , లాంటి విషయాలతో దాదాపు కేంద్రం 700కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వ 337.99 కోట్ల నిధులు సమకూర్చడం ఉంటుందని గుర్తు చేశారు. ఈ విషయంను రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు ,సాక్షర భారత్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ ,రాష్ట్ర జిల్లా నాయకులు రామ లింగయ్య గౌడ్, భీమయ్య , వెంకటరమణ, దేవరాజు , నెహ్రూ , సుధీర్ గౌడ్,రాజేశం, ,సత్యం,సంతోష్ రెడ్డి,బుచన్న,శ్రీ శే లం, శ్రీకాంత్, గ్రామ కోఆర్డినేటర్స్ మాధవి ,రుక్మిణి,సంజన,మమత,మల్లేశం మరియు అధిక సంఖ్యలో మండల గ్రామ కో ఆర్డినేటర్ లు పాల్గొన్నారు.
