◆  11 మంది కోళ్ల పందెం రాయుళ్ల అరెస్టు
 20,000 రూ. స్వాదీనం

◆ ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో దాడులు

◆ పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ వెల్లడి…..

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి  )మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారి కుంటలో కోళ్ల పందాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ …….సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్. తెలిపారు కోళ్ల పందాల్లో పాల్గొన్న 11 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న వారితోపాటు 11 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకోగా …..

మరి కొంతమంది పరారయ్యారన్నారు. 10 పందెం కోళ్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు పందెం రాయుళ్ల నుండి 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకులు, కోళ్ల పందాలు ఆడుతున్న ఫజియొద్దిన్, బట్టల రాజు, మన్నం పవన్ కుమార్, మాధవరపు శివయ్య, రాగిని గోపాల్, మహమ్మద్ గౌస్, మహమ్మద్ షఫీ, పిడుగు సదయ్య, సాయి, ఎస్.కె జుబేర్, మహమ్మద్ యూనిస్ లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎవరైనా కోళ్ల పందాలు నిర్వహించినా, ఆడిన చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.