అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )శుక్రవారం 22 ఏప్రిల్ 2022న ఉదయం పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర కరపత్రం విడుదల చేసిన అనంతరం పౌరహక్కుల సంఘం నేతలు   మాట్లాడుతూ…. పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభలు ఏప్రిల్,24,2022న ఆదివారం ఉదయం 10 గంటలకు ఉద్యమాలకు కేంద్రమైన గోదావరిఖనిలో జరుపుతున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమం ఏఐటియుసి భాస్కర్ రావు భవన్ లో నిర్వహిస్తున్నట్లు   తెలిపారు.   ఇట్టి బహిరంగసభకు ప్రధాన వక్తలుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి పాల్గొంటున్నారు అన్నారు. కావున కార్మిక ,కర్షక ,విద్యార్థులు,మేధావులు ,ప్రజాస్వామికవాదులు, కార్మిక నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.  కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పతి రాజగోపాల్ , జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి పుల్ల సుచరిత , జిల్లా కోశాధికారి నారా వినోద్ ,జిల్లా ఈ సి మెంబర్స్ యాదవనేని పర్వతాలు ,బొడ్డు పెళ్లి రవి ,మోట పలుకుల వెంకట్ ,తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య ,తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కమిటీ సభ్యులు గాండ్ల మల్లేశం, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి కార్యదర్శి ఎరుకల రాజయ్య, గూల్ల రాజన్న కూనారం భూసాధన కమిటీ కన్వీనర్ ,పులిపాక రవీందర్ ,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.