మేడే కార్మిక దినోత్సవం రోజు నీలి జెండా ఎగుర వేద్దాం…..
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరిపి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మేడే కార్మికదినోత్సవాన్నిఘనంగాజరుపుకోజరుపుకోవాలని.తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ పిలుపునిచ్చారు.మేడే కార్మిక దినోత్సవాన్ని నిర్వహించేటప్పుడు అంబేద్కర్ ఫోటోలను తప్పనిసరి పెట్టాలని అన్నారు.భారత రాజ్యాంగంలో పొందుపరచిన కార్మిక చట్టాలను కొనసాగించడానికి కార్మికులంతా ఐక్యంగా పోరాటంచేయాలన్నారు.కార్మిక చట్టాలు కార్మిక ప్రయోజనాల కోసం కొనసాగేలా చూడాలన్నారు.ఐక్య పోరాటంతోనే అనుకున్నది సాధించగలం అన్నారు.
