■  కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

■  తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్.

అగ్నిధారన్యూస్( గోదావరిఖని )తిలక్ నగర్ లోని ఐ ఎఫ్ టి యు కార్యాలయం లో జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు క్. విశ్వనాథ్. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘము రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్. ఐ ఎఫ్ టి యు నాయకులు ఈ. రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ……కోల్ ఇండియాలో సింగరేణిలో ఒక లక్ష మంది కాంట్రాక్ట్ కార్మికులు మన సింగరేణిలో 30 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు అన్నారు. వీరికి సమాన పనికి సమాన వేతనం హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని ,చలో కలకత్తా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అన్నారు. 11 ఏజ్ బోర్డులో సమాన పనికి సమాన వేతనం లేదా ఒకటో కేటగిరి వేతనం అమలు చేయాలని జాతీయ కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికుల వద్దకు వచ్చి పోరాటం చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ కేటగిరి వేతనాలు చెల్లించాలని తాము ఎనిమిదో వేతన ఒప్పందం కాలం నుంచి డిమాండ్ చేశారు.  దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.