■ భారతదేశం పటం పై
పాఠశాల ఆవరణలో అశ్లీల వెబ్ సైట్ రాతలు.
■ పట్టించుకోని ఉపాధ్యాయులు
పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం.
■ ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలి తల్లిదండ్రులు డిమాండ్.
■ ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరే కారణం.
అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ )శనివారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో. పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి మాధవి, ఎం ఈ ఓ ఆరేపల్లి రాజయ్య హాజరయ్యారు . అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి పాత్రికేయులు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన పాత్రికేయులు గోడల మీద రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాఠశాల కార్యాలయ గోడ పైన భారతదేశ చిత్ర పటం పైన అశ్లీల లకి సంబంధించిన వెబ్సైట్ వెబ్ సైట్ రాతలు దర్శనమివ్వడంతో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.దీనిపై పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి పాఠశాల కార్యాలయం గోడపై రోత రాతలు దర్శనం ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు పట్టించుకో కపోవడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ఉంది అని తెలిసి అక్కడికి అధికారులు, తల్లిదండ్రులు, మీడియా ప్రజా ప్రతినిధులు వస్తారని తెలిసి కూడా పాఠశాల ఆవరణలో పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి పాఠశాల సిబ్బంది పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల ఆవరణలో అశ్లీల వెబ్ సైట్ రాతలు రాసిన ఆకతాయిలను గుర్తించి చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఉపాధ్యాయులను విలేకరులు వివరణ కోరగా ఎవరో ఆకతాయిలు రాశారని అది మాకు తెలియదని అన్నారు. ఉదయం నుండి గోడపైన రాతలను ఎందుకు చూడలేదు అనేదానికి సమాధానం దాట వేశారు. విషయం తెలుసుకున్న కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకొని గోడలపై ఉన్న రాతలను తొలగింప చేశారు .దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి విద్యార్థి సంఘ నాయకులు బాలసాని క్రాంతి లెనిన్ మాట్లాడుతూ….

*చర్యలు తీసుకోవాలి*
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామము లోని ప్రభుత్వ పాఠశాల గోడల పైన అశ్లిల వెబ్సైట్ లకు సంబంధించి న రాతలు రాయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటం అనేది సమాజాన్ని పూర్తిగా తప్పు దారి పట్టించడమే ఇలాంటి రాతలు రాసిన వారిని గుర్తించి వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
