పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ సురక్షత-జాతీయ భద్రత అంశంపై అవగాహన సదస్సు

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లిజిల్లా) రామగుండం కమిషనరేట్ పరిధిలోగల పెద్దపల్లి జోన్ పెద్దపల్లి . పోలీస్ స్టేషన్ పరిధిలో గల చందపల్లి గ్రామం లో సైబర్ సురక్షత జాతీయ భద్రత అంశంపై శనివారం రోజు పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ లు  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ….తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము ,ఫోటోలు పంపిస్తాం ,యు ట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అంటూ ఇబ్బంది పెడుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చింది అనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసి అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారు. మరికొందరు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ దొంగిలించి అందులోని డబ్బును వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లతో మోసం చేసే వాళ్లు మరికొందరు కార్డ్ స్వైపింగ్, లోన్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ద్వారా నేరాలు చేసేవాళ్ళూ ఉన్నారుఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండటంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని,తమ ఇంటికి వెళ్ళాక చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆదర్శవంతమైన సమాజాన్ని రూపొందించుకోవాలని. ఆన్లైన్ మోసాలకు గురికావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మౌనిక పోలీస్ సిబ్బంది చందపల్లి ప్రజలు పాల్గొన్నారు