■  ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత.

■  జిల్లా కేంద్రంలో విషాద ఛాయలు.

■  దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, మంత్రి, సభాపతి.

.అగ్నిధారన్యూస్( కామారెడ్డిబ్యూరో) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీ చెందిన ఒకే కుటుంబానికి చెందిన మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో హైమద్(35), పర్వీన్ (30), అద్నాన్ (4), మహీమ్ (6), లు మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు కరెంట్ షాక్ తగిలి మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలలుముకున్నాయి. విద్యుత్ వైర్ తగిలి తల్లిదండ్రులు మరణించగా, తెగిన వైర్ పిల్లలపై పడి వారు కూడా మరణించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి విద్యుత్తు ప్రవాహం నిలిపివేశారు. అనంతరం మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విచార సంఘటన తెలుసుకొని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ కు,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, పరిస్థితిని వివరించడంతో సీఎం ఫోన్లో పరామర్శించి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద గంప గోవర్ధన్ 25000 రూపాయల నగదును అందజేశారు.