అగ్నిధారన్యూస్ ( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహమ్మదపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర పాటిల్ బుధవారం రోజు గ్రామ వీధుల్లో తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామంలో గ్రామ ప్రజలు ఎవ్వరు కూడా అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో ఒకటి రెండు రోజులు వర్షబావపరిస్థితులు నెలకొని ఉన్న దృశ్య ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అంజన్న వీఆర్ఏ అశోక్ అంజీ అనీల్ గ్రామస్థులు తదితరుల పాల్గొన్నారు.
