★  ఆందోళన చెందకండి అండగా నేనున్నా ఎమ్మెల్యే దాసరి.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి టౌన్ ) భారీ వర్షాల వల్ల ప్రజలు ఏవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి వద్ద సాయి గార్డెన్స్ లో వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిక్కుకోవడంతో వారితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఆందోళన చెందకండి అండగా ఉంటాం అని చెప్పి భరోసా కలిగించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కొద్దిసేపట్లోనే ఫంక్షన్ హాల్ నుండి సురక్షితంగా గజ ఈతగాళ్ల సహాయంతో కుటుంబంలోని నలుగురిని బయటకు తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ….. భారీ వర్షాల వల్ల రహదారులన్నీ జలవిగ్బంధమయ్యాయని ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. వాహనదారులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని లేకపోతే ప్రమాదారుల బారిన పడాల్సి వస్తుందన్నారు.

ప్రజలు ఆందోళన చెందవద్దు.

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునెందుకు ప్రభుత్వము సిద్ధంగా ఉందని పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు 24 గంటల పాటు శ్రమిస్తున్నారన్నారు. రక్షణ చర్యల్లో R&B EE నరసింహ చారి , పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎస్ ఐ లు రాజేష్,వెంకటకృష్ణ,కౌన్సిలర్ పుదరి చంద్రశేఖర్,PACS ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం, AMC డైరెక్టర్ కుంభం సంతోష్,నాగరాజు,వంశీ లతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.