అగ్నిధారన్యూస్ (సంగారెడ్డి )సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలo ఎంపీడీవో వెంకటేశం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదని కరెంటు తీగల వద్ద ‘కరెంటు స్తంభాల వద్దకు ,ప్రజలు వెళ్లరాదని అదేవిధంగా పశువులను కరెంటు స్తంభాల వద్దకు వేళ్ల నీయకూడదు అన్నారు.పొంగిపొర్లుతున్న వాగులు ,చెరువులు ,ప్రాజెక్టులు, కుంటలు, వద్దకు ప్రజలు ఎవ్వరూ  వెళ్లకూడదు అన్నారు. చిన్న పిల్లలను ఒంటరిగా బయటికి వెళ్ల నీయకూడదు వాతావరణం అనుకూలంగా లేనందున బాగా గాలులు వీస్తున్నందున చెట్ల కింద నిలిచి ఉండరాదు అని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశమున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  పేర్కొన్నరు.