■ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ ఐ వెంకటేష్ యాదవ్.
■ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి.
అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీలో ప్రతిష్టించిన గణనాథునికి ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ వెంకటేష్ యాదవ్, ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న చెన్నారం గ్రామవాసి జాటావత్ చందు నాయక్ కి అందజేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ స్వప్న భాస్కర్ రెడ్డి.వినాయక భక్త బృందం, శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, వార్డ్ మెంబర్ రమేష్ నాయక్, చందు నాయక్, బాజా,రైతు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు నాయక్, కృష్ణ నాయక్, కిషన్ నాయక్, చందు నాయక్, రవి నాయక్, సేవ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.
