అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) తలకొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్, శుక్రవారం రోజు తలకొండపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. రాఘవులు ని కలసి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనిల్,ముదిరాజ్,మాట్లాడుతూ .తలకొండపల్లి,గ్రామపంచాయతీలో 350 మందికి పింఛన్ల కోసం అర్హులు ఉంటే కేవలం 141 మందికి పింఛన్లు మంజూరు కావడం జరిగింది, పింఛన్ల కోసం 8సంవత్సరాలుగా చెప్పులు అరిగిందాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి పింఛన్లు వచ్చే సమయానికి పింఛన్ తీసుకోకుండానే స్థానికంగా ఐదు మంది చనిపోవడం, బాధాకరమైనటువంటి విషయం అన్నారు. ఇంకా అర్హులైన వారు గ్రామంలో 15 మంది వితంతువు పింఛన్లు మిగతావారు వృద్ధప్య పింఛన్లు కోసం అర్హత కలిగిన వారు ఉన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వినతిలో కోరారు. అదేవిధంగా ప్రభుత్వం.. ప్రజలకు మసి పూసి మారేడు కాయ చేసినట్టుగా తూతూ మంత్రంగా కొంత మందికి పింఛన్లను ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని నిరసనగా నేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందివ్వడం జరిగిందని తెలిపారు.
