అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్.,(డిఐజి)
కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారు మాట్లాడుతూ
సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక్క గొప్ప ఆయుధం”: సిపి రామగుండం*
*టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి*
సైబర్ నేరగాళ్ళ నయా మోసాలకు తెలంగాణ, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు నిత్యం అడ్డుకట్ట వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు నూతన పంథాలో జరుగుతుండటం అనేది సర్వసాధారణమైన అంశంగా పరిణమించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది పోలీసు సిబ్బంది, సైబర్ నిపుణులు ప్రజలలో అవగాహన సైతం పెంచేందుకు కృషి చేస్తున్నారు. కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి ,మంచిర్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం, పట్టణాలలో నిత్యం అవగాహన పెంచేందుకు కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నాము. అయితే పోలీసులు ఎంత చైతన్యపరుస్తున్నా ప్రజలలోని అమాయకత్వం వారి పాలిట శాపంగా మారుతుంది. సైబర్ నేరగాళ్ళు సైతం కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను సులభంగా బురిడీ కొట్టిస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు.
*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన సైబర్ నేరాల కేసుల వివరాలు…*
1. తేది: 26:03:2020 రోజున హాజీపూర్ గ్రామానికి చెందిన ఒక బాధితుడుకి నేరగాడు ఫోన్ చేసి మీ ఫోన్ పే యొక్క KYC అప్డేట్ లేదు, అప్డేట్ చేయాలి అంటే మీ ఫోన్ పే యొక్క MPIN చెప్పండి అని అడగగా బాధితుడు చెప్పాడు. ఆ తరువాత నీకు ఒక లింకు వస్తుంది ఓపెన్ చేయండి అని చెప్పగా బాధితుడు ఆ లింకును కూడా ఓపెన్ చేశాడు, వెంటనే బాధితుడు ఎకౌంటు నుంచి RS. 4999/- DEBIT అయినాయి.
2. తేది: 24-09-2021 రోజున బసంత్ నగర్ కి చెందిన ఒక బాధితునికి ఫోన్ పే కాష్ రివార్డ్ అంటూ worth Rs 1855/- స్క్రాచ్ కార్డ్ క్రోమ్ లో నోటిఫికేషన్ వచ్చింది. బాధితుడు స్క్రాట్ కార్డు స్క్రాచ్ చేసి వెంటనే UPI PIN ఎంటర్ చేశాడు. దాంతో బాధితుడి అకౌంట్ నుంచి RS. 1855/- DEBIT అయినాయి. అదే పద్దతిలో జనగాం గ్రామానికి చెందిన మరొక బాధితుడు తేది: 22-10-2021 రోజున Rs. 9372/- నగదు పోగొట్టుకున్నాడు.
3. తేది: 08-10-2021 రోజున హాజీపూర్ గ్రామానికి చెందిన ఒక బాధితుడు FB చూస్తున్నప్పుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాడ్ వచ్చింది. బాధితుడు ఆ యాడ్ చూసి దాని కింద ఉన్న ఫోన్ నెంబర్ కి మెసేజ్ చేయగా, నేరగాడు బాధితులతో మీకు ఒక లింకు వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పగా బాధితుడు తన ఫోన్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తరువాత నేరగాళ్లు బాధితులతో మీరు మా వెబ్ సైట్ లో ఉన్న ఐటమ్స్ ని ముందు పర్చేస్ చేస్తే ఆ తర్వాత మీకు మీరు పర్చేస్ చేసిన అమౌంట్ తో పాటు కమిషన్ కూడా కలిపి మీకు ఇస్తాను అని చెప్పారు. ముందుగా బాధితునికి RS. 350/- & 750/- కమీషన్ రూపంలో ఇచ్చారు. అది నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా RS. 62,000/- మొత్తం తో ఐటమ్స్ పర్చేస్ చేయగా, వారి కమిషన్ అమౌంట్ వ్యాలెట్ లో జమ అవుతుంది కానీ WITHDRAW చేసుకోవడం కుదరట్లేదు. బాధితుడు నేను అమౌంట్ విత్ డ్రా చేసుకుంటా అని నేరగాడితో అడగగా నేరగాడు మీరు మరి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలి అప్పుడే మొత్తం అమౌంట్ విత్ డ్రా చేసుకోవడం కుదురుతుంది అని చెబుతున్నాడు.
4. తేది: 18-10-2021 రోజున కాసిపేట గ్రామానికి చెందిన ఒక బాధితుడికి మీ YONO అప్లికేషన్ లో PAN CARD డీటెయిల్స్ అప్డేట్ లేవు, అప్డేట్ చేసుకోకపోతే నీ YONO ACCOUNT సస్పెండ్ అవుతుంది అని మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి పాన్ కార్డు డీటెయిల్స్ మరియు తాను రిసీవ్ చేసుకున్న ఓటిపి ని కూడా ఎంటర్ చేయగా వెంటనే బాధితుడి అకౌంట్ నుంచి Rs. 4 వేలు డెబిట్ అయినాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ……..
ఉద్యోగ అవకాశాలు, అతి తక్కువ ధరలో వస్తువులు, వాహనాలు అంటూ వచ్చే మెసేజ్ లింకులు, ఈ మెయిల్ లింకులు, సామాజిక మాధ్యమాలలోని లింకులను తొందరపడి తెరపడండి. ముందూ వెనక ఆలోచించకుండా లింకులను తెరవడం వలన మన ఫోన్ వారి అధీనంలోకి వెళ్ళిపోయి మన ఫోన్లోని విలువైన సమాచారం. ఖతాల్లోని నగదు కోల్పోయే అవకాశం ఉంది.
మీకు ఎలాంటి సంబంధం లేకుండా మీ ఖాతాల్లో నగదు జమ అయిన ఉపసంహరణకు గురి అయినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ప్రధానం. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 100, లేదా 155260 నంబర్లలో సంప్రదించాలి.
కొత్త ఫోన్ నెంబర్ల నుండి లేదా అనుమానిత సభ్యులు కలిగిన నెంబర్ల నుండి కాల్స్ వస్తుంటే వాటికి స్పందించక పోవడం అత్యుత్తమం.
డెబిట్ కార్డుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటిపై పిన్ నెంబర్ లను రాయవద్దు, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రంలో వైఫై ఎనేబుల్ కార్డుతో స్వైపింగ్ లేకుండా 5000 వరకు సొమ్ము డ్రా చేసే అవకాశం ఉంది. ఫోస్ పే, గూగుల్ పే లాంటి మొబైల్ వాలెట్లను ఉపయోగించి లావాదేవీలు చేసే ముందు కన్ఫర్మేషన్ చేసుకున్నాకే / ధృవీకరించుకున్నాకే నగదు పంపాలి.
మోసపూరితంగా మీ ఖాతాలోని నగదు సైబర్ నేరగాళ్ళు దోచారని భావించిన వెంటనే ఆ లావాదేవిని నిలిపివేసేందుకు 155260 బోల్ ఫ్రీ నెంబరులో లేదా డయల్ 100లో ఫిర్యాదు చేయాలి. డబ్బును సైబర్ నేరగాళ్ళు మాయంచేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వారు సైబర్ నేరస్థులు భాతాల లావాదేవీలను నిలిపివేసి మన సొమ్మును మనకి అందించే
అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైబర్ నేరాలను ఫిర్యాదు చేసేందుకు NCRP portal (www.cybercrime.gov.in) లో పిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. చక్కని సహకారానికి మార్గంగా ఉంటుందన్నారు
