అగ్నిధార న్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణం మండల పరిషత్ కార్యాలయం ముందు గల అమరవీరుల స్థూపం వద్ద గత నాలుగు రోజులుగా మధ్యాహ్న భోజన వర్కర్లు ధర్నా చేస్తున్నారు తమ సమస్యల సాధనకు ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం హుజురాబాద్ ఎన్నికల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల పైన వారికి అన్నం పెట్టె మా పైన లేదన్నారు ఎన్ని రోజులైనా శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు తమకు గత కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనం వండి నటువంటి పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడం ద్వారా ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మన్నారు సొంత డబ్బులతో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకుపెడుతున్నామన్నారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోషనీయం అన్నారు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మా జీవితాలకు భరోసా ఇవ్వాలని లేని యెడల సమ్మె ఇలాగే కొనసాగుతున్నది అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సదానందం సునీల్ రమేష్ విద్యార్థి నాయకుడు బాలసాని లెనిన్ ,జంగం లక్ష్మి కనకమ్మ జక్కుల రాజేశ్వరి లావణ్య స్వరూప పద్మ రాజమ్మసౌందర్య రమాదేవి తదితరులు పాల్గొన్నారు.