■  జిల్లా కేంద్రంలో  ఎమ్మెల్యే దంపతులు.

■  పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి.

■  భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎసిపి సారంగపాణి.

 ■  ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రజలు.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా)ప్రతి సంవత్సరం హిందువులు జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగలు రెండు ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి విజయదశమి ఈ రెండు పండుగలకు 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత అంటే నెల రోజులపాటు పల్లె పట్టణం అనే తేడా లేకుండా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగలను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం అయిందని చెప్పొచ్చు.మహిళలు బొడ్డెమ్మతో మొదలు పెట్టి ఎంగిలిపుప్వుల బతుకమ్మ,, సద్దుల బతుకమ్మ, ఇలా దాదాపు 20 రోజులపాటు వేడుకలు జరుపుకొని చివరికి సద్దుల బతుకమ్మతో బతుకమ్మను అన్ని రకాల రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి ఆనందాన్ని పొందారు. ఎక్కడ చూసినా బతుకమ్మలు చూడముచ్చటగా చూపరులను ఆకట్టుకున్నాయి. చివరి రోజు బతుకమ్మలను బావిలో చెరువులలో కుంటలలో నీటి ప్రవాహంలో నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా . ఊరువాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా ఆడి పాడి అహ్లాదం పొందారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. అధికారులు ప్రజాప్రతిని తేడా లేకుండా కలిసిపోయి సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా క్రతువు నిర్వహించారు. జిల్లాలో రామగుండం మంథని పెద్దపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడపడుచుల ఆనందకేలీల మధ్య బతకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. జనపదాలతో మహిళలంతా గళం విప్పి ఆడి పాడారు.జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, మహిళ మున్సిపల్ కౌన్సిలర్స్, మహిళ అధికారులు, మహిళ ప్రజా ప్రతినిధులు, అంతా ఒక చోటికి చేరి స్థానిక మినీ ట్యాంక్ బండ్ పైన ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. బతుకమ్మ కార్యక్రమానికి పెద్దపల్లి ఏసీపి సాదుల సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.