అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం లోని ఓదెల మల్లన్న గుడి ఆలయంలో ఆదివారం రోజు నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ను పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.పది రోజులుగా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,లతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీల మండల స్థాయి నాయకుల మధ్య కాక రేపిన అక్రమ ఇసుక ముడుపులపై సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వానికి పెద్దపల్లి పోలీసులు చరమగీతం పలిపారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విసిరిన సవాల్ ని దాసరి మనోహర్ రెడ్డి ఎక్కడ స్వీకరించినట్లు చెప్పకపోయినప్పటికీ మల్లికార్జున ఆలయానికి వెళ్లాలని సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో శనివారం నుండే విజయ రమణారావు తోపాటు ఆయన ముఖ్య అనుచరులను పెద్దపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసుల కంటపడకుండా ఆదివారం ఉదయం విజయ రమణారావు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆలయంలో ప్రమాణం చేయడానికి వెళుతున్న విజయ రమణారావుని ఎసిపి సారంగపాణి నిలువరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజయ రమణారావు విసిరిన సవాల్ ని ఎక్కడ స్వీకరించినట్లు చెప్పకపోయినప్పటికీ ఆదివారం ఉదయం తన అనుచరులతో కలిసి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరుతున్న సమయంలో పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి వచ్చి ఎమ్మెల్యే ను హౌస్ అరెస్టు చేశారు. అగ్నిధార పత్రికలో చెప్పినట్లుగానే జిల్లాలో రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్ల వరకే పరిమితం అవుతున్నాయి. రామగుండం, మంథని నియోజకవర్గాల్లో కూడా అధికార,వామపక్ష, ప్రతిపక్ష నాయకుల మధ్య ఏ విధంగానైతే సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరుకొని పోలీసులచే అరెస్టు కాబడ్డారో సేమ్ టు సేమ్ పెద్దపల్లి నియోజకవర్గం లో కూడా సీన్ రిపీట్ అయింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన ఇంట్లో అరెస్టు చేయగా చింతకుంట విజయ రమణారావుని ఓదెల మల్లన్న ఆలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
పోలీస్ అంటే
జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే జిల్లాలో జరుగుతున్న అన్ని అంశాల పైన పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు డేగ కన్ను వేసి ఉంచి పొంచి ఉన్న ప్రమాదాలను ముందే పసిగట్టి నియంత్రించడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సఫలమవుతున్నారు. అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా, శాంతిభద్రతలకు సమస్య కలుగుతుంది అనుకున్నప్పుడు, నియంత్రించడంలో వెనుకకు తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లపై పోలీసులు సకాలంలో స్పందించనట్లయితే బడా నాయకులు బాగానే ఉన్నప్పటికీ కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం లేకపోలేదు, ఏది ఏమైనప్పటికీ పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో సిఐలు ప్రదీప్ కుమార్ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐలు సంయుక్తంగా చేసిన కృషి ఫలితంగా సమస్య తాత్కాలికంగా సమాసిపోయిందని చెప్పవచ్చు.


