◆◆●ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి) జిల్లా జిల్లాలో గత పది రోజులుగా పెద్దపులి పులి హల్చల్ సృష్టిస్తుంది మొదట పది రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో టైగర్ జోన్ లో ప్రారంభమైన పెద్దపులి ప్రయాణం పెద్దంపేట, ధర్మారం, కొత్తూరు ,మంగళవారం లోక పేట బుధవారం ఉదయం పెద్దపల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో పెద్దపులి పాదాలు దస్తగిరిపల్లి చెందిన రైతులు చిటపైన వినోద్ కుమార్ ,కొమురయ్య, సాగర్, సదయ్య, శ్రీనివాస్ రెడ్డిలు, వ్యవసాయ క్షేత్రంలో కనిపించాయి. అనుమానంతో అగ్నిధార ఫోటోలు వీడియోలు డి ఎఫ్ ఓ సిహెచ్ శివయ్యకు పంపించగా పెద్దపులి పాదాలుగా నిర్ధారిస్తూ అగ్నిధారకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులి ప్రయాణం ముఖ్యంగా హుస్సేన్ మియా వాగు పరివాహ ప్రాంతాల వెంట కొనసాగుతుంది అన్నారు. ఆ ప్రాంత ప్రజలు రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

