■ కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మమతారెడ్డి.
■ పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దాలి.
■ కమిషనర్ ను సన్మానించిన కౌన్సిలర్ ప్రజలు.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి టౌన్ )పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి. మంగళవారం రోజు పెద్దపల్లి పట్టణంలోని 3వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా,కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో కమిషనర్ వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ..పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని అలాగే ప్రతిరోజు ఇంట్లో వెళ్లే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి ఇంటి వద్దకు విజిల్ వేస్తూ వచ్చే మా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ గా బాధ్యతలు చెప్పట్టి వార్డుకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ని కౌన్సిలర్, వార్డు ప్రజలు మహిళలు శాలువతో ఘనంగా సన్మానించారు ఈకార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేందర్,వార్డు ఇంచార్జ్ శ్రవణ్, మెప్మా ఆర్పీ స్వప్న మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


