■ ప్రమాదకరంగా డివైడర్లు పట్టించుకోని అధికారులు.
■ కూల్చడంలో పెట్టిన శ్రద్ధ నిర్మాణంలో లేదు.
■ ప్రమాదాలు జరగకముందే పు:నర్నిర్మాణం జరగాలి
■ క్షణాల్లో తప్పిన ప్రమాదం
అగ్నిధారన్యూస్ ( పెద్దపెల్లిటౌన్ ) ఆగస్టు 29 రోజున పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చిన విషయం విధితమే.ఆసమయంలో జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు, పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బహిరంగ సభ రాజీవ్ రహదారి పక్కనే కావడం చేత సభ వేదికకు వచ్చిపోయే జనాలతో, వాహనాలతో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో, ఉన్నతాధికారుల ఆదేశాలతో, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి నుండి కలెక్టరేట్ కు వెళ్లే రాజీవ్ రహదారిపై ఉన్న రోడ్డు డివైడర్ ను, అదేవిధంగా పెద్దకల్వల వద్ద గల రోడ్డు డివైడర్ ని, కూల్చివేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, కూల్చివేసి డివైడర్లు దాదాపు రెండు నెలలు కావస్తున్న కూల్చడంలో చూపిన శ్రద్ధ నిర్మించడంలో చూపడం లేదు. సంబంధిత అధికారులు పు:నర్నిర్మానం చేయడంలో విఫలం చెందారు,అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని పట్టించుకున్న పాపాన పోయినవారు లేరు. రాజీవ్ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి. డివైడర్లు తొలగించిన ప్రాంతంలో వేగ నియంత్రణ, హెచ్చరిక సూచికలు లేకపోవడం చేత వాహనదారులు గమనించకుండా వేగంగా వెళుతున్నారు. సోమవారం రోజు రంగంపల్లి డివైడర్ వద్ద ఇద్దరు వాహనదారులు క్షణాల్లో ప్రమాద బారి నుండి తప్పించుకున్నారు. ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు సంభవించక ముందే ఉన్నత అధికారులు స్పందించి కూల్చివేసిన డివైడర్లను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

