అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సమాజవాది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పోలీసులు అడ్డుకున్నారు. నూతన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని విచ్చిన్నం చేశారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అరెస్టు చేసి పెద్దపల్లి పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో మారం తిరుపతి యాదవ్ ను అరెస్టు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున తన గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి యాదవ్ మహిళలతో కలిసి ర్యాలీగా బయలుదేరి స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సమస్యను పరిష్కరించేంతవరకు అంబేద్కర్ విగ్రహం వద్దనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.