■ భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని
అగ్నిధారన్యూస్ (మంథని )శనివారం రోజు మంథని మండలం గుంజపడుగు గ్రామంలో మహిళా చైతన్య సదస్సు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి , ముఖ్య అతిథులుగా భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని, సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్య నింపడానికి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ మహనీయుల జీవిత చరిత్రను మనకు తెలియపరిచేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మంథని మండలం మహిళా సమైక్య అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ. మహిళలందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలని అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక, హింసలను ఖండించారు.ఈ కార్యక్రమంలో మంథని జడ్పిటిసి సుమలత , గీత బాయి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
వేదికపైన మాట్లాడుతున్న మంథని మండలం మహిళా సమైక్య అధ్యక్షురాలు సంధ్య
