అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

చలో హైదరాబాద్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మాదిగ ఉద్యోగులు
MEF రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంకురి రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాదిగ మాట్లాడుతూ,

1994 సం,లో శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నిరంతరం పోరాడుతున్న విషయంతెలిసిందే.
ఈ సందర్భంలో నే ఎమ్మార్పీఎస్ అనేక అనుబంధ విభాగాలు నిర్మాణం చేయడం జరిగింది.అందులో బాగంగా ఏర్పడిన మాదిగ ఉద్యోగుల 5 వ మహాసభ అక్టోబర్ 24 న హైదరాబాద్ లో జరుగుతుంది అని తెలియ జేస్తూ ఆ మహాసభకు కేంద్ర మంత్రులు జి, కిషన్ రెడ్డి గారు,కేంద్ర సామాజిక న్యాయం శాఖామంత్రి,అబ్బయ్య నారాయణ స్వామి గారు(కర్ణాటక),మరో కేంద్ర మంత్రి లోకనాథన్ మురుగన్ (తమిళనాడు)గారు హాజరు కానున్నారు
న్యాయం ఆలస్యమైతే అన్యాయంచేసినట్లే, వర్గీకరణ చట్టబద్ధత కోసం జాతి అభివృద్ధి లో పాలుపంచుకోవాలని,24 న జరిగే మాదిగ ఉద్యోగుల 5 వ జాతీయ మహాసభ ను విజయవంతం చేయడానికి బయలుదేరిన వారిలో పోగుల వెంకటేష్, సుద్దాల లింగయ్య, తాండ్ర శ్రీనివాస్, కల్వల మల్లేష్, సిరిసిల్ల శంకర్, రమేష్ బాబు, తిరుమల రాజు తదితరులు ఉన్నారు.