అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

ప్రభుత్వం నిషేధించిన గంజాయి,గుట్కా,మరేఇతరమత్తు పదార్థాల పాన్ షాపులలో కిరాణాషాపుల్లో తనిఖీలు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి రవీందర్

పోలీసు కమిషనర్ గారి ఆదేశానుసారం పెద్దపల్లి డిసిపి రవీందర్,ఏసిపి గోదావరిఖని గిరి ప్రసాద్ , సిబ్బందితో కలసి గోదావరిఖనిలో ఉన్న పాన్ షాపులలో మరియు కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, మరియు ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పట్టణాలలో,గ్రామాల్లో ఎవరైనా వ్యక్తుల వద్ద మరియు పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు తగిన పారితోషికం అందజేస్తామని పెద్దపల్లి డీసీపీ గారు తెలిపారు.