అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:
ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించిన కొమ్ము మధు కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్ము మధు ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అన్నారు ఈ సందర్భంగా అగ్నిధార అ న్యూస్ తో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం మొత్తంలో నల్ల ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడానికి నిరంతరం ముందుంటుందని అన్నారు రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డితో పాటు వార్డుమెంబర్లు అట్ల సత్యనారాయణ, తిర్రి రమేష్, లోకిని మల్లమ్మ -సమ్మయ్య, లోకిని శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ యువత తదితరులు ఉన్నారు
