అగ్నిధార న్యూస్ కరీంనగర్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దపెల్లి నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు వీణవంక మండలం బొంతపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది మోడీ గారు చేసిన అభివృద్ధి పనులను కెసిఆర్ చేస్తున్న మోసాలను
ప్రజలకు వివరించడం జరిగిందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో తంగెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం కృషివలుడు మీ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి బిజెపి అభ్యర్థి ఈటెలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోల్సాని సంపత్రావు కొలనూరు ఎంపీటీసీ కారంగుల శ్రీనివాస్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి దాడి సంతోష్ పడాల శ్రీనివాస్ ముంజ రాజేంద్ర ప్రసాద్ బడుగు శ్రీనివాస్ నాగరాజు పలువురు పాల్గొన్నారు
