అగ్ని ద్వారా న్యూస్ మంథిని :

మంథని మండలంలోని ఆరెంద గ్రామంలో అక్షరాస్యత మరియు నగదు రహిత లావాదేవీల కార్యక్రమం,ఋణ విస్తరణ కార్యక్రమం ది కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారిచే నిర్వహించారు.ఈ సందర్భంగా   ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ బ్యాంక్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.కనుక ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని ఋణ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకళ-జనార్దన్, జెడ్పిటిసీ తగరం సుమలత-శంకర్ లాల్,సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోలుపు శంకర్ గౌడ్, నాబార్డ్ అధికారి సతీష్,బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్,సింగిల్ విండో డైరెక్టర్లు పొశం, ప్రభాకర్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.