తహశీల్దార్అంబటి రజిత.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలములోని నిరుపేదలకు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకము లో బాగముగా అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితా సమర్పించాలని  తహసీల్దార్, అంబటి రజిత తెలిపారు.  ఈ పథకానికి నివాస స్థలం ఉండి ఇల్లు లేని బలహీన వర్గాలకు చెందినవారు ,ఆహార భద్రత కార్డ్ కలిగి ఉండి,  జివో నెం.59 లో లబ్దిపొందని వారు ఈ గృహలక్ష్మి పథకానికి అర్హులని  పథకమునకు దరఖాస్తులు స్వీకరణ  ఆగస్టు 5వ తేదీ  నుండి ఆగస్టు 10వ తేదీ వరకు స్వీకరించ బడుతాయని ఆమె తెలిపారు.దరఖాస్తులు స్వీకరించు సుల్తానాబాద్ మున్సిపాలిటి పరిధి ప్రజలు మున్సిపాలిటి కార్యాలయము వద్ద  సుల్తానాబాద్ మండల పరిదిలోని వివిధ గ్రామాల ప్రజలు సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయములో  స్వికరించబడును.ఇట్టి  దరఖాస్తుల వెంట ఖాళీస్థలము  యొక్క హక్కు పత్రాలు,రేషన్ కార్డు,ఆధార్ కార్డు, ఆదాయ దృవీకరణ పత్రం,కుల దృవీకరణ పత్రం, మొదలైన ధృవీకరణ పత్రాల యొక్క జిరాక్స్ ప్రతులు దరఖాస్తు వెంట జతపరిచి సమర్పించి ఇట్టి సమర్పించిన దరఖాస్తుల పై  ఆగస్టు 20 నుండి   విచారణ జరిపి ఆగస్టు 25 కల్లా ఇళ్ళ మంజూరి జాబితా ప్రకటించబడుతుందని ఆమె తెలిపారు. లబ్ధిదారులు అర్హతలు కలిగినవారు పైన తెలిపిన తేదిలలో  చూపించిన సమయం ,స్థలాలలో  ధరఖాస్తు చేసుకోవాలని  సుల్తానాబాద్ తహశీల్దార్ రజిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.