కేసును దర్యాప్తు చేస్తున్న సుల్తానాబాద్ ఎస్ ఐ విజేందర్
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పాలు విక్రయించుకునే రైతు చిక్కుడు రవీందర్ ఇంట్లో ఆదివారం రోజు తెల్లవారుజామున దొంగతనం జరిగింది.రెండున్నర తులాల బంగారు గొలుసు ఇతర బంగారు వెండి,ఆభరణాలతో పాటు లక్ష రూపాయలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారని బాధిత రైతు చిక్కుడు రవీందర్ తెలిపారు.తమ కుటుంబ సభ్యులు అంతా ఉదయం ఆవులు గేదెల పాలు పిండడానికి డైరీ ఫామ్ లోకి వెళ్ళగా ఇది గమనించిన దొంగలు తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సుల్తానాబాద్ ఎస్ ఐ మాట్లాడుతూ క్లూస్ టీమును రప్పించి త్వరతగతిన ఈ కేసును చేదిస్తామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


