లక్ష్యం నిర్దేశించుకోవాలి  పట్టుదలతో చదవాలి.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

నూతన ఎస్ ఐ లకు ఘన సన్మానం.

 ఎల్.బి నగర్ ట్రాఫిక్   డీసీపీ   శ్రీనివాసులు.

అగ్నిధారన్యూస్(ఆమనగల్లు) ఇటీవల వెలువడిన ఎస్.ఐ ఫలితాలలో ప్రతిభ కనబరచి ఎస్ ఐ లుగా ఎంపికైన ఆమనగల్లు, కడ్తాల్ మండలాలకు చెందిన విద్యార్థులు మధు ,  రాకేష్ , దేవేందర్ , సునీత ,  లింగంగౌడ్ ,  శ్రీకాంత్ , శ్రీను లను శుక్రవారం రోజు స్థానిక మాస్టర్స్ డిగ్రీ కళాశాలలో  “స్నేహ హస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సత్కరించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎల్.బి నగర్ ట్రాఫిక్   డీసీపీ   శ్రీనివాసులు ,ఫౌండేషన్ వ్యస్థాపక అధ్యక్షులు నల్గొండ జిల్లా విజిలెన్స్ సీఐ చరమందరాజు గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా  డీసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ… విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని ప్రణాళిక బద్ధంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు.  చరమందరాజు గౌడ్ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఉద్యోగార్ధులకు ఉద్యోగ సాధనలో సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ అధ్యక్షులు తల్లోజు చంద్రశేఖర్ , ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య , కోశాధికారి లింగంపల్లి ఆనంద్ , కార్యవర్గ సభ్యులు పున్న వెంకటేష్ , విడియాల ఆనంద్ , సిరందాసు జగదీశ్వర్ , ధనరాజ్  కళాశాల సిబ్బంది చందు , శివలింగం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.