విచారణ మొదలుపెట్టిన సుల్తానాబాద్ తహశీల్దారు.
అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల సమీపంలో గల నీలగిరి చెట్ల వనాల మధ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా రూపాయల కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న గ్రామస్తులు సమాచారంతో నిన్న రాత్రి అక్కడికి వెళ్లి ఆ దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది. బుధవారం ఉదయం సుల్తానాబాద్ తహసిల్దార్ కు ఈ సమాచారం తెలుపడంతో హుటాహుటిన నీరుకుల్ల గ్రామానికి చేరుకొని మట్టి దందాపై విచారణ చేసి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదనారెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైన శిక్ష తప్పదని, వాహనాలు సీజ్ చేస్తామని ఆయన తెలిపారు.ఈ విచారణలో సుల్తానాబాద్ రెవిన్యూ సిబ్బంది, ఆర్ఐలు పాల్గొన్నారు.
*ఆ టిప్పర్ డ్రైవర్ ఎక్కడ…?*
విచారణ నిమిత్తం రెవెన్యూ అధికారులు కోమండ్లపల్లి గ్రామంలో గల గుత్తేదారుని ఇంటికెళ్లి టిప్పరు జెసిబి వాహనాల కోసం విచారణ ప్రారంభించి టీ ఎస్ 02యూబి 8919 గల టిప్పర్ ను సీజ్ చేసి విచారణ నిమిత్తం తీసుకువస్తుండగా… మార్గ మధ్యలో గల కాట్నపెల్లి గ్రామంలో టిఫిన్ నిమిత్తమై డ్రైవరు ఆపగా అధికారులకు తెలియకుండా వాహనానికి తాళం వేసుకొని పారిపోయాడు. ఇదే విషయమై సుల్తానాబాద్ సీఐని చరవాణిలో విచారించగా తమ దృష్టికి రాలేదని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సుల్తానాబాద్ సీఐ జగదీష్ తెలిపారు. మరి ఇప్పుడు ఆ వాహనం ఎక్కడుందో ఎప్పుడు పట్టుకొస్తారు వేచి చూడాలి మరి……
