అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఒకవైపు స్వతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంగా 14 తారీకు రోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిని, శివ పార్వతి నగర్( అప్పన్నపేట) అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కి చెందిన దినసరి కూలి 15 సంవత్సరాలు కలిగిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెద్దపల్లి ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న నలుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం పెద్దపల్లిని విడిచి మధ్యప్రదేశ్ కి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలోని మార్గమధ్యంలో అత్యాచారానికి గురైన బాలిక చనిపోయినట్లు తెలుస్తుంది.
