రైతు వేయించిన తూకం రసీదు

 మిల్లు యాజమాని మోసం చేశారంటున్నా రైతు.

తూకంలో చేతివాటం ప్రదర్శిస్తున్న వ్యాపారులు.

అగ్నిధార వివరణతో  రంగంలోకి దిగిన తూనికల కొలతల శాఖ అధికారులు.

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు.

రైతు తూకానికి  (ఒక ట్రాక్టర్ )  కాటన్ మిల్ తూకానికి 45 కిలోల తేడా.

అన్యాయం చేశారంటున్నా రైతు.

సర్దుకు పొమ్మన్న అధికారులు ప్రజాప్రతినిధులు.

అగ్నిధారన్యూస్ (కమాన్ పూర్) .ముందు దగా, వెనుక దగా, వెనుక ముందు అంతదగా, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ, నిరక్షరాస్యులైన, అమాయకపు రైతులను విత్తనాలు కొన్ననాటి నుండి మొదలు,  పంట చేతికొచ్చి అమ్మేంతవరకు, అన్ని స్థాయిలలో వ్యాపారులు అందిన కాడికి అక్రమంగా డబ్బులు దండుకుంటూ  దోపిడీకి పాల్పడుతూ మోసం  చేస్తూ నిత్యం పబ్బం గడుపుతున్న ప్రబుద్ధులు ఎందరో మనకు తెలిసిందే.ఈ కోవాలోనే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కలవేని శ్రీనివాస్ అనే పత్తి రైతు మంగళవారం రోజు సాయంత్రం పత్తిని అమ్మకం నిమిత్తం రెండు ట్రాక్టర్ లలో.   కమాన్ పూర్ మండలలోని  గొల్లపల్లి గ్రామంలో గల పరమేశ్వర కాటన్ మిల్లుకు అమ్మకానికి తీసుకువెళ్తూ మార్గమధ్యంలో ఉన్న రంగంపల్లి వే బ్రిడ్జి వద్ద తూకం వేయించుకొని  పరమేశ్వర కాటన్ మిల్లుకు  తీసుకువచ్చాడు. కాటన్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జి కాంట మీద అక్కడి యాజమాన్యం  తూకం వేయించింది. సమస్య అక్కడే మొదలైంది రంగంపల్లి గ్రామంలో ఉన్న వే బ్రిడ్జి కాంటతూకం, మిల్లులోని వే బ్రిడ్జి కాంటా తూకం కు 45 కేజీల తేడా వచ్చింది. దీంతో పత్తి రైతు అభ్యంతరం తెలపడంతో సదురు కాటన్ మిల్లు యాజమాన్యం వేరే వే బ్రిడ్జి దగ్గరకు పంపించగా అక్కడ మొదట తూకం వేసిన రంగంపల్లి వే బ్రిడ్జ్ కి సమానంగా తూకం వచ్చింది. దీంతో పత్తి రైతు శ్రీనివాసు కాటన్ మిల్లు యాజమానిని ప్రశ్నించగా రేపు ఉదయం  రమ్మని చెప్పాడు. బుధవారం ఉదయం పత్తి మిల్లుకు రైతు వెళ్లగా సదరు పత్తి మిల్లు యాజమాన్యం మేము పత్తిని తీసుకోవడం లేదని పత్తి రైతుకు చెప్పగా రైతు ఆందోళనకు గురై ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో అగ్నిధార రిపోర్టర్ ని సంప్రదించాడు. వెంటనే  తూనికల కొలతల శాఖ అధికారి విశ్వేశ్వర్ దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకు వెళ్తూ వివరణ అడగగా, అగ్నిధార  అందించిన సమాచారంతో  సదరు మిల్లుపైన తూనికల కొలతల అధికారులు ఆకస్మిక దాడి చేసి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, బాధిత రైతుకు, మిల్లు యాజమాన్యానికి మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్య బయటికి రాకుండా తొక్కిపట్టి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతు తూకం వేయించిన వే బ్రిడ్జ్ తో పాటు, పరమేశ్వరి కాటన్ మిల్లులోని వే బ్రిడ్జ్ ని క్షుణ్ణంగా పరిశీలించి జరుగుతున్న తతంగంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు చేపట్టి, రైతులను ఆదుకోవాలని  పలువురు  డిమాండ్ చేస్తున్నారు.

                మిల్లులో వేసిన తూకం రసీదు