అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన  సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, మేకల రాజయ్య, బండ గోపాల్, లచ్చయ్య, తదితరులు మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు సమక్షంలో ఆదివారం రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీగిరి శ్రీనివాసు మాట్లాడుతూ… పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

శివపల్లి, బొంతగుంటపల్లె బిఆర్ఎస్ కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో చేరిక.

బొంతకుంటపల్లి, శివపల్లి గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు  జనగామ శ్రీధర్ రావు (వార్డు సభ్యులు), బండి ఉదయ్ కిరణ్ (వార్డు సభ్యులు), అసరి సంపత్ (వార్డు సభ్యులు), బెజ్జెంకి కనకయ్య (వార్డు సభ్యులు), జూపెల్లి శ్రీనివాస్ రావు, జూపెల్లి తిరుమల రావు, ఆసరి రవీందర్ యాదవ్, లింగంపెల్లి కోమురయ్య, జూపేల్లి శ్రీధర్ రావు, ఆసరీ శ్రీనివాస్  ఆసరి హరీష్  పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు  చింతకుంట విజయరమణ రావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలోకి తీసుకురావాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మినుపాల ప్రకాష్ రావు, దుగ్యాల సంతోష్ రావు, ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.