అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మడలం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పన్నూరు ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో లోంకకేసారం గ్రామానికి చెందిన కారుపాకల సదయ్య (40) మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం సదయ్య తన అత్తవారింటికి బేగంపేట గ్రామానికి వెళ్తుండగా సాయంత్రం 6:30 గంటల సమయంలో గుర్తు తెలియని ఆటో ఢీకొట్టగా తలకు తీవ్ర రక్త గాయం అయినది. వెంటనే చికిత్స కొరకు గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచనలపై మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుని తల్లి కారుపాకల రాజమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రవి ప్రసాద్ తెలిపారు.
