శబరిమలై కి ఆర్టీసీ కొత్త బస్సులు సిద్దం.

నర్సంపేట డీఎం ప్రసూనలక్ష్మీ.

అగ్నిధారన్యూస్ నర్సంపేట్

  నర్సంపేట:  శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రతి పాదికన టీఎస్ఆర్టీసీ బస్సులను సిద్దం చేసినట్లు ఆర్టీసీ స్థానిక నర్సంపేట డిపో మేనేజర్ కె. ప్రసూనలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇటీవల 700 లకు  పైగా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంది. సుశిక్షితులైన డ్రైవర్లతో భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది. ఇట్టి బస్సులో టీవీ సౌకర్యం, సెల్ ఫోన్ చార్జింగ్ పాయింట్స్ కలవు. ఇద్దరు 10 సంవత్సరాల వయసులోపు గల మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులకు సామాన్లు సర్దేందుకు ఒక వ్యక్తి సీటు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు అని ఆమె తెలిపారు. ఒక్క బస్సు లేదా అంతకంటే ఎక్కువ బస్సులు బుక్ చేసిన గురు స్వామికి లేదా బుక్ చేసిన వ్యక్తికి ఆ బస్సుపై రూ.300లు కమీషన్ సైతం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. శబరిమలకు వెళ్లి వచ్చే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలను కూడా  దర్శించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959226052 నంబర్ లో సంప్రదించవచ్చని డీఎం ప్రసూనలక్ష్మీ తెలిపారు.