పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
ఆదివారం రోజు పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన ఉద్యమకారుల కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనల, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సహకారం అయింది అని తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ఉద్యమకారులను పట్టించుకొని పాపనపోలేదు. ఉద్యమ సమయంలో మీ జీవితలను త్యాగం చేసి ప్రజలను ఏకతాటిపై నడిపారు. మరియు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యమకారుల జీవితంల్లో వెలుగు వస్తాయి అని అనుకుంటే అన్యాయం మాత్రమే జరిగింది అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవం ఉంటుంది. మీ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరింంచేలా కృషి చేస్తాం అని అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యమకారుల పార్టీ మరియు ఉద్యమంలో సమయంలో మీపై ఉన్న మీపై ఉన్న కేసులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీపై ఉన్న కేసులను ఎత్తివేయడం జరిగింది త్వరలో వారీ మిగితా కేసులను కూడా ఎత్తివేస్తాం అని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అండగా ఉంటుంది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఉద్యమకారులను పెద్ద పీట వేసింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యమకారుల సంఘం చైర్మన్ సీమ శ్రీనివాస్, గుండేటి ఐలయ్య యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ బత్తుల శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, ఈర్ల సురేందర్, డొంకెన రవీందర్, మాడ నారాయణ రెడ్డి, పిడి కృష్ణ, ఆంజనేయ రావు, కళాకారులు తూముల రాజయ్య , చంద్రకళ, శ్యామల, పెద్దపల్లి పార్లమెంట్ ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

