తాత్కాలిక ఆధార్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించిన యువ నాయకుడు గుజ్జ విజయ్ రావు.

 అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

గత రెండు సంవత్సరాల నుండి సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆధార్ సేవలు నిలిచిపోవడంతో మండలం కేంద్రంలోని సుద్దాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్తుండడంతో  అక్కడ కూడా ఉదయం 6 గంటలకు 30 మంది కంటే ఎక్కువ టోకెన్లు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 31న రేషన్ కార్డు కేవైసీ ముగిస్తూ ఉండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతోగ్రామప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుద్దాల గ్రామ ప్రజలు యువ నాయకుడైన గుజ్జ విజయ్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆధార్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి  సుద్దాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఆధార్ సెంటరు ఏర్పాటు చేసి  ఐదు రోజులపాటు  మార్పులు, అప్డేటు చేస్తామని ఆయన తెలిపారు. ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయించిన గుజ్జ విజయ్ రావు కు సుద్దాల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.