అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తు గతంలో ఎన్ని సార్లు గెలిచిన కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించని నాయకులు మళ్ళీ పోటీచేస్తున్నారని కానీ ఈ సారి మీరు మాత్రం అభివృద్ది కోసం మీలో ఒకడిగా మీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా మీ కష్టసుఖాలు తెలిసిన వాడిగా, మీ ముందుకు వస్తున్న అన్నారు మీ అమూల్యమైన ఓటు నాకే వేయాలని అన్నారు.45 సంవత్సరాలు ఒకరు , ఒకరు పది సంవత్సరాలు , ఇంకొకరు పది సంత్సరాల పాటు గెలిచిన కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని మళ్ళీ ఎం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రధాన పార్టీలపై నిప్పులుచెరిగారు. ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని , తాను గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా వారి సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేశానన్నారు. ఎవరేమీ చెప్పిన విని ఓటు మాత్రం నాకే వేయాలని అన్నారు. ప్రజలు అనుకుంటే మార్పు జరుగుతుందన్నారు. సామాన్యుడిగా మీ ముందుకు వచ్చానన్నారు. సహకరించాలని వేడుకుంటున్నానన్నారు, నా వెనుక మంది మార్బలం ఆస్తులు అంతస్తులు ఏవి లేవన్నారు. ప్రజలే నాఆస్తి ప్రజాబలమై నా ధైర్యం అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన తండాలు , ఆదివాసి గుడాల గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకులు,తదితరులు పాల్గోన్నారు.
