అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా:
వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డిఓ పద్మావతి వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీకి చెందిన మొత్తం 22 మంది కౌన్సిలర్ ల తో పాటు ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ పుట్టపాక మహేష్ ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్ పాకనాటి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. రెండు పదవుల కోసం వీరు ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడం తో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి సిఐ, టౌన్ ఎస్ఐ లు బందోబస్తు చేపట్టారు.