కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలి.
ఉపాధి కూలీలతో పెద్దపల్లి ఎమ్మెల్యే.
కూలీ దినాలను 100 రోజుల నుండి 200 పెంచుతాం.
రోజుకి 400 రూపాయలు కూలి పెంచుతాం.
ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాo
రైతులకు500 రూపాయల బోనస్ ఇస్తాం.
అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి//సుల్తానాబాద్ )
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిపిసిసి ఉపాధ్యక్షులు, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆరు,ఏడు గ్రామాలు తిరుగుతూ, ప్రజలను ఓట్లు అర్థిస్తున్నారు.
శనివారం రోజున ఉదయం సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి, కదంబపూర్, తొగర్రాయి , మంచిరామి,కనుకుల, గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అలాగే తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీ, దేశవ్యాప్తంగా, జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు వివరించారు.
ఈ సందర్బంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు మాట్లాడుతూ…
👉 ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు..
👉స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తాం అన్నారు..
👉వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ అందజేస్తాం అని తెలిపారు…
👉తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తాం అన్నారు…
👉ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు…
👉 ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులకు కోత పెట్టాడు తప్ప, కనీసం పని దినాలు కూడా పెంచలేదు అని అన్నారు…
👉 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే,వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తాం అన్నారు..
👉 ఉపాధి హామీ రోజువారి కూలీ 400కు పెంచుతాం అన్నారు…
👉కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం…
👉వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తాం అన్నారు…
👉 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలినీ ఈ సందర్భంగా అన్నారు.
👉BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.




