రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలో ఓ రైతు మొక్కజొన్న చేనులో పనులు ముగించుకొని ట్రాక్టర్ పై చిన్న బొంకూర్ వెతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ట్రాక్టర్ పైనున్న ఏడుగురు మహిళల్లో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకొని హుటా హుటిగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకొని చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన బేతి లక్ష్మి, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, మృతుల కుటుంబ సభ్యులను, అలాగే హాస్పటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయ రమణారావు పరామర్శించి, ప్రగాఢ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.




