కొనుగోలు ప్రక్రియ వేగవంతచేయాలి

లారీల కొరత లేకుండా చూస్తాను.

ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.

అగ్నిధారన్యూస్, కాల్వశ్రీరాంపూర్, గురు శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాత తల్లడిల్లిపోయారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట నంత కల్లాల్లోపోసి అమ్ముకునే సమయంలో, అన్నదాతలను అకాల వర్షం అతలాకుతలం చేసింది. అది చూసి చెలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు నియోజకవర్గంలోని రైతాంగాన్ని ఓదార్చి ఆదుకోవడానికి బయలుదేరారు.వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పక్రియ వేగవంతం చేయాలని లారీల కొరత లేకుండా చూస్తానని ఎమ్మెల్యే శుక్రవారం ఓదెల మండలంలో పర్యటించారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్,మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, కూనారం ,గ్రామాల్లోని సొసైటీ, ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. లారీల కొరత లేకుండా చూస్తామని కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవరు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 80 శాతం వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని కొన్ని కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు మిగిలి ఉన్నాయని సెంటర్ నిర్వాహకులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తుందని రైతులెవరు అధైర్య పడవద్దు అన్నారు. మిల్లర్లు కటింగ్ పెడతామంటే మిల్లర్లు చుట్టూ ,సెంటర్ నిర్వాహకుల చుట్టూ రైతులు తిరగవద్దని నాదృష్టికి తీసుకు వస్తే ఏలాంటి కట్టింగ్ లేకుండా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. వర్షాకాలంలో రైతులు పంట సాగు ముందుగా ప్రారంభించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మండల యూత్ అధ్యక్షుడు శివరామకృష్ణ నాయకులు డొంకెన మొగిలి, సాధనమైన కొమురయ్య, ఎండి ఖలీల్, రణవేన శ్రీనివాస్, బంగారు రమేష్, తదితరులు పాల్గొన్నారు.