ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )
శనివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో గల శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణములో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి 331వ గురుపూజ ఆరాధన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం,పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ లో గల లక్ష్మీ గణపతి సంతోషిమాత దేవాలయంలో జరిగిన 23వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాలతో ఘనంగా చేశారు, పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యేను వేద పండితులు ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ……
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 331 వ ఆరాధన ఉత్సవాలు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పతనం తెలియనివారు తెలుగు రాష్ట్రాలలో ఉండరని అన్నారు. ఆయన తన కాలజ్ఞానశక్తితో రాబోయే ముందు రోజుల్లో మానవజాతి ఎట్లా ఉంటుందో ముందే గ్రహించి, కాలజ్ఞానం రాశారని గుర్తు చేశారు. ఆయన కాలజ్ఞానంలో రాసిన చాలా విషయాలు జరిగాయని, జరుగుతున్నాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పురోహితులు, విశ్వబ్రాహ్మణులు,ఆలయ అర్చకులు,ఆలయ కమిటీ సభ్యులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

