అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మండల కేంద్రంలోని చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు వ్యవసాయ పని నిమిత్తమై మియాపూర్ గ్రామంలో మొక్కజొన్న చేను పనులు పూర్తిచేసుకుని మక్క కంకుల లోడుతో వ్యవసాయ కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళ వ్యవసాయ కూలీలు బేతిలక్ష్మి, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకొని సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



