అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: కమాన్పూర్ మండల నుండి నిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా… కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం మధ్యాహ్నం రాఘవపురం సమీపంలో టిప్పర్లలో అక్రమటి తరలిస్తున్న సమాచారంతో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు పెద్దపల్లి తహసిల్దార్ తన సిబ్బంది తో   హుటాహుటిన రాఘవాపురం చేరుకొని ఎనిమిది అక్రమ మట్టి తరలింపు టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ.. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు… అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదన్నారు. శిక్ష తప్పదని, వాహనాలు  సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవిన్యూ సిబ్బంది, ఆర్ఐలు పాల్గొన్నారు. కమాన్పూర్ మండల కేంద్రం నుండి  నిర్భయంగా అక్రమ మట్టి తరలిస్తున్న.. 8 టిప్పర్లు ఎక్కడ నుంచి ఎక్కడికి మట్టి సరఫరా చేస్తున్నారనే విషయం పైన  విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తహసిల్దార్ రాజకుమార్ తన కార్యాలయంలో విలేకరులు  అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.