అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ పట్టణం లోని బస్టాండ్ దగ్గర మూలమలుపు వద్ద మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పెద్దపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ వైపు వెళ్తుండగా టిప్పరు వాహనం ఢీకొట్టగా అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.