సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

– జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -07:

లోక్ సభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

లోక్ సభ ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉండడం వలన ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిర్వహించని విషయం తెలిసిందే, ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసినందున తిరిగి ఈ నెల 10నసోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి ప్రజావాణిలో తమ తమ సమస్యలపై అర్జీలను అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.