మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు.
చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు.
అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
అనుకున్నట్లుగానే మంథని ఎంపీఓ ఆరిఫ్ పైన వేటుపడింది విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ పంచాయతీరాజ్ హైదరాబాద్ కి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సరెండర్ చేశారు.
సంవత్సర కాలంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, అనేక రకాలుగా వేధిస్తున్నాడని విచారణ అధికారి జడ్పీ సీఈవో విచారణలో ఋజువయింది… ఎంపీఓ చేసే ఆర్థిక దోపిడికి సహకరించాలంటు అలాగే, మహిళ పంచాయతీ కార్యదర్శుల పట్ల ఎంపీఓ ప్రవర్తించిన తీరు పంచాయతీ కార్యదర్శిలను, తన వ్యక్తిగత డ్రైవర్లుగా వాడుకుంటున్న విధానం, మహిళ పంచాయతీ కార్యదర్శుల భర్తలను అవమానించిన విధానాలపైన.. విచారణలో వెల్లడి కావడం.. అలాగే ఎంపీఓ ఆరిఫ్ చట్టబద్ధమైన తన విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని మండల పంచాయతీ అధికారిగా పనికి రారని నివేదికల ఆధారం చేసుకుని సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కమిషనర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయిమెంట్ హైదరాబాదుకు ఎండి ఆరిఫ్ హుస్సేన్ ని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
