అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి మండల వ్యవసాయ కార్యాలయం లో బుధవారం మండల వ్యవసాయ అధికారి అలివేణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వరి పంట ను రైతులు వీలైనంత వరకు తగ్గించి అట్టి విస్తీర్ణం లో  వేరుశనగ, నువ్వు లు, పొద్దుతిరుగుడు పెసర్లు మినుములు ఆయిల్ ఫామ్ కొర్రలు సజ్జలు మరియు చిరుధాన్యాలు ఇతర లాభదాయక పంటలు వేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి ఆరుతడి పంటలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఆరుతడి పంటల తో రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. వరి పంటలు వేయడం వలన ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని, ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని అన్నారు. రైతులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర పంటపై మొగ్గు చూపాలని అన్నారు.